Mon Dec 23 2024 14:10:50 GMT+0000 (Coordinated Universal Time)
ఏడో మైలురాయి వద్దే ఏనుగుల గుంపు
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు సంచరిస్తుంది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగుల గుంపు సంచరిస్తుంది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఏనుగులు తమ పై దాడి చేస్తుందేమోనని వాహనదారులు భయపడిపోతున్నారు. నిన్న ఏనుగులు గుంపు కన్పించిందని తెలియగానే టీటీడీ రాకపోకలను నిలిపివేసింది. మొదటి ఘాట్ రోడ్డు ఏడో మైలు రాయి సమీపంలో ఐదు ఏనుగులు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అడవిలోకి పంపేందుకు....
అయితే అవి బ్యారికేడ్లు దాటుకుని రోడ్డు మీదకు వచ్చే అవకాశం లేదని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి చెబుతున్నారు. వాహనదారులు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలోకి పంపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Next Story