Mon Dec 23 2024 15:06:32 GMT+0000 (Coordinated Universal Time)
సుప్రీంలో ఓబులాపురం మైనింగ్ కేసు
ఓబులాపురం మైనింగ్ కంపెనీ కార్యకలాపాలపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఓబులాపురం మైనింగ్ కంపెనీ కార్యకలాపాలపై సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మైనింగ్ కార్యకలాపాలకు అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. మైనింగ్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతిని కోరుతూ ఓఎంసీ అధినేత గాలి జనార్ధన్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.ఓఎంసీ అధినేత గాలి జనార్థన్ రెడ్డి 2019 మార్చి నెలలో అనంతపురం జిల్లా ఓబులాపురం మైనింగ్ లో లీజు ప్రాంతాన్ని దాటి జరిపారన్న ఆరోపణలపై పనులు నిలిపేయాలని అప్పట్లో సుప్రీంకోర్టు ఆదేశించింది.
సరిహద్దులు తేల్చాలని...
మైనింగ్ ప్రాంతం, ఏపీ, కర్ణాటక సరిహద్దుల్లో ఉండటంతో సరిహద్దులు తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లీజు ప్రాంతాన్ని మార్కింగ్ చేసేంత వరకూ మైనింగ్ ను కొనసాగించవద్దని అప్పట్లో సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ మైనింగ్ లీజుే ప్రాంతాలను దాటి పనులు చేసినట్లు నిర్ధారించింది. లీజు ప్రాంతాన్ని అతిక్రమించినందుకు భారీగా జరిమానా విధించిన సెంట్రల్ ఎపంవర్డ్ కమిటీ మళ్లీ ప్రారంభించేలా సిఫార్సు చేసింది.
వివాదం ముగిసిందని...
గత ఏడాాది జులైలో సరిహద్దు వివాదం ముగిసిందని, సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం సరహద్దులు తేల్చుకున్నామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది. మైనింగ్ లీజు పరిధి సమస్య పరిష్కారం కావడంతో తాము మైనింగ్ చేసుకోవడానికి ఓబులాపురం కంపెనీ అనుమతి కోరింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరగా తమకు అభ్యంతరం లేదని చెప్పింది. గాలి జనార్థన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిల మధ్య వ్యాపార ప్రయోజనాల బంధంపై విమర్శలు ఉన్నాయి. మైనింగ్ లీజు ప్రాంతంలో క్షేత్రస్థాయిలో ఎక్కడా బౌండరీలు లేవని వెల్లడించింది. అటవీ అనుమతులు లేకుండానే మైనింగ్ జరిగినట్లు గుర్తించింది.
Next Story