Mon Dec 23 2024 02:07:08 GMT+0000 (Coordinated Universal Time)
Srisailam : శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు.
శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఉగాది కావడంతో భక్తుల సంఖ్య అధికంగా ఉంది. స్వామి వారి దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. ప్రధానంగా కన్నడ రాష్ట్రం నుంచి అధిక సంఖ్యలో భక్తులు చేరుకోవడంతో శ్రీశైలంలోని మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది.
ఉగాది రోజు...
ఉగాది పర్వదినం రోజున మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటే మంచిదని కన్నడిగులు భావిస్తారు. అందుకే ఎక్కువగా వారు శ్రీశైలానికి చేరుకున్నారు. స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. క్యూ లైన్లలో భక్తులు పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు.
Next Story