Mon Dec 23 2024 13:29:04 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : నేడు జనసేన విస్తృత స్థాయి సమావేశం
జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నేడు జరగనుంది
జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం నేడు జరగనుంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాల నేతలు పాల్గొననున్నారు.
కీలక నిర్ణయాలు...
ఈ సమావేశలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. టీడీపీతో పొత్తు తర్వాత జరుగుతున్న పరిణామాలపై చర్చించనుంది. అంతే కాకుండా రెండు పార్టీలు కలసి ఉమ్మడి పోరాటానికి సిద్ధమవ్వాలన్న నిర్ణయాన్ని ఈ సమావేశం ద్వారా తెలియజేయనున్నారు రానున్న ఎన్నికల్లో రెండు పార్టీల క్యాడర్ కలసి పనిచేయడానికి అవసరమైన పరిస్థితులు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలు గురించి కూడా చర్చించనున్నారు. ఓటర్ల జాబితా అక్రమాలపై ఇరు పార్టీలూ సంయుక్తంగా ఉద్యమం చేయాలన్న నిర్ణయాన్ని ఈ సమావేశలో చేస్తారని తెలిసింది.
Next Story