Sun Dec 22 2024 17:11:40 GMT+0000 (Coordinated Universal Time)
కడియం నర్సరీలో చిరుతపులి
తూర్పు గోదావరి జిల్లాలోని కడియం నర్సరీలో చిరుత పులి ప్రవేశించింది. సీసీ కెెమెరాల ద్వారా చిరుతను గుర్తించారు
తూర్పు గోదావరి జిల్లాలోని కడియం నర్సరీలో చిరుత పులి ప్రవేశించింది. సీసీ కెెమెరాల ద్వారా చిరుతను గుర్తించారు. పాదముద్రలను కూడా గుర్తించిన అధికారులు ఇక్కడ చిరుతపులి తిరుగుతుందని అటవీ శాఖ అధికారులు థృవీకరించారు. దీంతో కడియం నర్సరీ రైతులు ఆందోళన చెందుతున్నారు.
రైతుల్లో ఆందోళన...
తూర్పు గోదావరి జిల్లాలో మొన్నటి వరకూ చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఆ చిరుత నేడు కడియం నర్సరీలోకి ప్రవేశించిందా? వేరేదా? అన్న అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. రైతులు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. జంతువులను కూడా అక్కడ వదలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే చిరుత పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అది ఎటు వెళ్లిందో అర్థం కావడం లేదని చెబుతున్నారు.
Next Story