సరికొత్తగా రాఖీ పండుగ చెట్లకు రాఖీలు కట్టిన చిన్నారులు
అన్నా, చెల్లెళ్ళ మధ్య అనుబంధాలకు ప్రతీకగా, దేశ వ్యాప్తంగా రాఖీ పండుగను జరుపుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో ఓ ప్రైవేట్ పాఠశాలలో వినూత్నంగా "మనం చెట్లకు రక్షణ-చెట్లు మనకు రక్షణ" అంటూ వృక్షాలకు రాఖీలు కట్టి సరికొత్త రీతిలో రాఖీ పండుగ నిర్వహించారు.
సరికొత్తగా రాఖీ పండుగ
చెట్లకు రాఖీలు కట్టిన చిన్నారులు
అన్నా, చెల్లెళ్ళ మధ్య అనుబంధాలకు ప్రతీకగా, దేశ వ్యాప్తంగా రాఖీ పండుగను జరుపుకుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో ఓ ప్రైవేట్ పాఠశాలలో వినూత్నంగా "మనం చెట్లకు రక్షణ-చెట్లు మనకు రక్షణ" అంటూ వృక్షాలకు రాఖీలు కట్టి సరికొత్త రీతిలో రాఖీ పండుగ నిర్వహించారు. ముదిగుబ్బ పట్టణంలోని శాంతి ఆనంద పాఠశాలలో రక్షాబంధన్ మహోత్సవాన్ని చెట్లకు రాఖీ కట్టి జరుపుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి స్వయంగా రాఖీలను తయారు చేసుకొని "వృక్షో రక్షతి రక్షితః" అంటూ పాఠశాల ఆవరణలో చెట్లకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.
చెట్లకు మనం రక్షణ, మనకు చెట్లు రక్షణ”, “వృక్షో రక్షతి రక్షితః” అంటూ నిర్వహించిన పర్యావరణహిత రక్షాబంధన్ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులందరూ రాఖీ ఆకారంలో నిలబడి, వివిధ విన్యాసాలు చేసి చూపరులను ఆకట్టుకున్నారు.
కర్ణాటక రాష్ట్రంలోని హూటగళ్లిలోని రోటరీ మిడ్ టౌన్ ఎకాడమీ పాఠశాల విద్యార్థులు కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని (జూన్ 5న) కూడా ఇదేవిధంగా చెట్లకు రాఖీలు కట్టి వినూత్నంగా రూపొందించారు. ‘చెట్ల జాతర’ పేరుతో రూపొందించిన ఈ కార్యక్రమం చెట్లను పరిరక్షించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించడానికి వినూత్నంగా చేపట్టారు. అభివద్ది పేరిట రోడ్లు, ఫై ఓవర్లు, మెట్రో ట్రైన్ల కోసం అనేక చెట్లను నరకడంతో మన దేశంలో చెట్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో పర్యావరణం దారుణంగా దెబ్బతింటోంది. జీ 20 సమావేశాలుకూడా దీనిపైనే నిర్వహించబోవడం గమనార్హం.
పచ్చని చెట్లను తమ అన్నదమ్ములుగా భావిస్తూ, వాటికి రాఖీలు కట్టి ప్రేమను వ్యక్తం చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన విద్యార్థులు. పెద్ద పెద్ద రాఖీలు తయారు చేసి, తమ తల్లిదండ్రులతో కలిసి వేప, తుమ్మ వంటి చెట్లకు పిల్లలు రాఖీలు కడుతున్నారు. అంతేకాకుండా తాము చేయారు చేసిన రాఖీల మీద `చెట్లను నాటండి... పర్యావరణాన్ని కాపాడండి` అంటూ సందేశాలు కూడా రాశారు. చెట్టు కాండాన్ని శుభ్రంగా కడిగి, దానికి కుంకుమ బొట్టు పెట్టి, రాఖీలను కట్టి చెట్టును ఆలింగనం చేసుకుని తమ ప్రేమను చిన్నారులు వ్యక్తం చేస్తున్నారు.