Fri Dec 27 2024 22:21:11 GMT+0000 (Coordinated Universal Time)
నేడు విశాఖకు జగన్
ఈరోజు విశాఖలో జీ-20 సన్నాహక సమావేశం జరగనుంది. ఈ సదస్సులో దేశ విదేశీ అతిథులు పాల్గొననున్నారు
ఈరోజు విశాఖలో జీ-20 సన్నాహక సమావేశం జరగనుంది. ఈ సదస్సులో దేశ విదేశీ అతిథులు పాల్గొననున్నారు. ఇప్పటికే చాలామంది విశాఖ చేరుకున్నారు. ఈ సదస్సు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు సాయంత్రం విశాఖపట్నం వెళుతున్నారు. విశాఖపట్నం సాయంత్రం వెళ్లి రాత్రికి రాడిసన్ బ్లూలో జరగనున్న ప్రతినిధుల డిన్నర్ లో పాల్గొని తిరిగి ఈరోజు రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
జీ 20 సన్నాహక....
రెండు రోజుల పాటు జరిగే జీ 20 సన్నాహక సమావేశాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశానికి దాదాపు ఇరవై దేశాల నుంచి 200 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. వీరందరి కోసం ప్రత్యేకంగా వసతి సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో పాటు భద్రతపరంగా కూడా అన్ని చర్యలు తీసుకుంది. విశాఖలో ఈ రెండు రోజుల పాటు పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు అధికారులు తెలిపారు.
Next Story