Sat Dec 21 2024 13:16:10 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు
కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఆగి ఉన్న లారీనని టాటా మ్యాజిక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు.
అతి వేగమే...
ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా తొమ్మిది మందికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో స్థానికులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాడేపల్లిగూడెం నుంచి విశాఖపట్నం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story