Sat Jan 04 2025 07:18:38 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతిలో స్వల్ప భూకంపం
ఆంధ్రప్రదేశ్ లో స్వల్పంగా భూమి కంపించింది. తిరుపతి సమీపంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ 3.6 తీవ్రతగా నమోదయింది.
ఆంధ్రప్రదేశ్ లో స్వల్పంగా భూమి కంపించింది. తిరుపతి సమీపంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ 3.6 తీవ్రతగా నమోదయింది. ఈరోజు తెల్లవారు జామున తిరుపతి సమీపంలో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలో బయటకు పరుగులు తీశారు. కొందరు నిద్రలో ఉండి గమనించలేకపోయారు. ఇంట్లో సామాన్లు జరగడంతో భూమి కంపించినట్లుగా ప్రజలు గుర్తించారు.
ప్రాణ, ఆస్తి నష్టం....
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ భూకంప కేంద్ర తిరుపతికి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమిలో 20 కిలీమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు. అయితే దీనివల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు చెప్పారు.
Next Story