Mon Dec 23 2024 09:38:40 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతిలో ఇస్రో సైంటిస్టుల బృందం
చంద్రయాన్-3 మినీయేచర్ నమూనాను స్వామివారి వద్ద ఉంచి.. ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించింది.
ఇస్రో సైంటిస్టుల బృందం తిరుపతిలో గల వెంకటాచలపతి ఆలయానికి విచ్చేసింది. గురువారం ఉదయం ఆలయానికి వచ్చిన బృందం.. చంద్రయాన్-3 మినీయేచర్ నమూనాను స్వామివారి వద్ద ఉంచి.. ప్రయోగం విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించింది. మరోవైపు సూళ్లూరుపేటలోని చెంగాలమ్మ ఆలయంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరికొత్త టెక్నాలజీతో చంద్రయాన్-3 ప్రయోగం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరో వారంరోజుల వ్యవధిలో PSLV-C57 రాకెట్ ప్రయోగం కూడా జరుగనుంది. ఆగస్ట్ చివరి వారంలో ఆదిత్య L1 రాకెట్ ప్రయోగం కూడా ఉంటుందని వెల్లడించారు.
ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. జులై 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు శ్రీహరికోట నుంచి చంద్రయాన్ -3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. చంద్రయాన్ 3 కోసం.. ఈ రోజు మధ్యాహ్నం 1.05 నిమిషాల నుంచి కౌంట్ డౌన్ ప్రారంభించనుంది. LVM-3-M4 రాకెట్ ద్వారా చంద్రయాన్-3 ప్రయోగం జరగనుంది. చంద్రయాన్ -3 ప్రయోగం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ప్రయోగం విజయవంతం కావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
Next Story