Mon Dec 23 2024 23:52:48 GMT+0000 (Coordinated Universal Time)
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సవాలు చేస్తూ గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
పిటీషన్లు కొట్టివేసి....
అయితే ఈ పిటీషన్లను కేసు కొట్టివేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తమను సీబీఐ అన్యాయంగా ఇరికించిందని వారు గతంలోనూ కోర్టును ఆశ్రయించారు. తాజాగా దస్తగిరిని అప్రూవర్ గా మారడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
Next Story