Tue Jan 07 2025 02:17:48 GMT+0000 (Coordinated Universal Time)
రెండు రోజులు స్కూళ్లకు సెలవు ప్రకటించిన ఏపీ సర్కార్
విజయనగరం జిల్లాలో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈరోజు, రేపు స్కూళ్లకు సెలవు ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు
విజయనగరం జిల్లాలో రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈరోజు, రేపు స్కూళ్లకు సెలవు ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది తుపాను గా మారే అవకాశమున్నందున విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. జావాద్ తుపానుతో ప్రభుత్వం అప్రమత్తమయింది.
రైళ్లు రద్దు...
ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ఆ యా జిల్లాలక ఇన్ ఛార్జిలుగా నియమించింది. లోతట్టు ప్రాంతాల వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తుపాను కారణంగా ఈదురుగాలులు వీచే అవకాశమున్నందున పాత భవనాలను గుర్తించి అక్కడి నుంచి పంపించి వేస్తున్నారు. కొన్ని రైళ్లను కూడా అధికారికంగా దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. హౌరా, ఫలక్ నుమా, విశాఖ ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దయినట్లు తెలిపారు.
Next Story