Wed Dec 18 2024 20:52:00 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీ నేతలు మిస్సింగ్.. సమావేశానికి హాజరు కాకపోవడానికి రీజన్ ఇదే
వైసీపీనేతల విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమయింది. కొందరు నేతలు సమావేశానికి హాజరు కాలేదు
వైసీపీ నేతల విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమయింది. వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు హాజరయ్యారు. అయితే కొందరు నేతలు మిస్ అయ్యారు. బెంగళూరు - విజయవాడ మధ్య విమాన సర్వీస్ రద్దు కావడంతో కొందరు నేతలు ఈ సమావేశానికి దూరంగా ఉన్ానరు. ఉదయం 7.05 గంటలకు బెంగళూరు నుంచి విజయవాడకు బయలుదేరాల్సిన విమానం చివరినిమిషంలో రద్దయింది.
విమానం రద్దు కావడంతో...
ఈ విమానంలో మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్, రాప్పాడు మాజీ ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాష రెడ్డి, హిందూపురం ఇన్ఛార్జి దీపిక, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చంద్రగిరి అభ్యర్థి మోహత్ రెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, వెంకటగౌడ, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి సమావేశానికి రాలేదు. మిగిలిన అభ్యర్థులు సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల ఫలితాలపై జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story