Tue Nov 26 2024 05:38:56 GMT+0000 (Coordinated Universal Time)
జాతకం పిచ్చి.. మేకతో పెళ్లి
నూజివీడులో ఓ యువకుడు మేకను పెళ్లి చేసుకున్నాడు. అర్చకులు దగ్గరుండి ఈ యువకుడికి మేకతో మొదటి వివాహ జరిపించారు
జాతకం పండితుడికి చూపించుకున్నాడో యువకుడు. ఆ యువకుడికి రెండు పెళ్లిళ్లు జరుగుతాయని చెప్పడంతో ఆ యువకుడు అశుభంగా భావించారు. మొదట పెళ్లి చేసుకున్న యువతి మరణిస్తుందేమోనిని భావించాడు. అయితే దీనికి దోష నివారణ ఏంటని ఆ పండితుడిని యువకుడు అడగటంతో మేకను మొదట పెళ్లి చేసుకో. తర్వాత మామూలు పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చాడు ఆ వేద పండితుడు.
వేదోశ్చారణల మధ్య....
ఇది హాస్యనటుడు రాజేంద్ర ప్రసాద్ నటించిన అప్పుల అప్పారావు, ఆ ఒక్కటీ అడక్కు సినిమాల్లో ఈ సీన్ చూశాం. అచ్చం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ లాగే జాతకాల పిచ్చి ఈ నూజివీడు యువకుడికి. కానీ అది సినిమా. ఇది జీవితం. పూంపుహాడ్ అంటూ జాతకం చెప్పింది ఎవరో కాని నూజివీడులోని అన్నవరం రోడ్డులో యువకుడు మేకను పెళ్లి చేసుకున్నాడు. అర్చకులు దగ్గరుండి ఈ యువకుడికి మేకతో మొదటి వివాహ జరిపించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్ అయింది.
Next Story