Mon Dec 23 2024 16:41:11 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో నేడు కాలేజీల బంద్.. ఎందుకు ?
జూనియర్ కాలేజీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికే ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి..
ఏపీ వ్యాప్తంగా నేడు జూనియర్ కాలేజీల బంద్ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఏబీవీపీ పిలుపుతో జూనియర్ కాలేజీలన్నీ మూతపడ్డాయి. జూనియర్ కాలేజీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికే ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజులు భారీగా వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించడం లేదన్నారు.
విద్యార్థులకు ఉండాల్సిన వసతులు, కావలసిన పుస్తకాలు లేకుండా పాఠాల బోధన ఎలా జరుగుతుంది అని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులను ఏర్పాటు చేయడంతో పాటు.. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు అధికంగా వసూలు చేస్తున్న ఫీజులను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు.. జూనియర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Next Story