Wed Mar 26 2025 21:15:34 GMT+0000 (Coordinated Universal Time)
Vidadala Rajani : పోసాని బయటకు. రజనీ లోపలికి .. సిద్ధమేనా?
మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు నమోదయింది

మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు నమోదయింది. ఆమెను త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని తెలిసింది. ఏసీబీ కేసులో విడదల రజనీతో పాటు మరికొందరిపై కూడా కేసులు నమోదయ్యాయి. విజిలెన్స్ అధికారులను పంపించి బెదిరించి యడ్లపాడులోని స్టోన్ క్రషర్ నుంచి 2.20 కోట్ల రూపాయలు విడదల రజనీ బ్యాచ్ వసూలు చేసిందని ఏసీబీ ఆరోపిస్తుంది. రజనీతో పాటు ఐపీఎస్ అధికారి పల్లె జాషువాతాో పాటు మరికొందరిపైన కూడా కేసులు నమోదు చేశారు. అనేక సెక్షన్లకింద నమోదయిన ఈకేసుల్లో ఏ2 నిందితురాలిగా విడదల రజనీ ఉన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇచ్చిననివేదిక ను ఆధారంగా చేసుకుని కేసు నమోదయింది.
2.20 కోట్లు తీసుకుని...
2020లో ఈ ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు. స్టోన్ క్రషర్ ను క్లోజ్ చేయకుండా ఉండాలంటే తమకు 2.20 కోట్ల రూపాయలు చెల్లించాలని బెదిరించడంతో దాని యజమానులు చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావులు రజనీని కలిసి చర్చించారు. తర్వాత రజనీ అనుచరులకు ఆ డబ్బులు చెల్లించినట్లు ఆధారాలున్నాయని ఏసీబీ అధికారులు తెలిపారు. డబ్బులు ఇవ్వడం ఆలస్యమయిందని భావించి, ఆగ్రహించి రజనీ విజిలెన్స్ అధికారుల చేత స్టోన్ క్రషర్ పై దాడులు కూడా నిర్వహించి దాని యజమానులను భయభ్రాంతులకు గురి చేసినట్లు కూడా ఫిర్యాదు అందింది. ఎవరి అనుమతి లేకుండానే విచారణ చేసిన అప్పటి ఐపీఎస్ అధికారి పల్లె జాషువాను కూడా ఈకేసులో నిందితులుగా చేర్చారు.
బెదిరించి.. దాడులు చేయించి...
స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి యాభై కోట్ల రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని, నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషర్ ను నిర్వహిస్తున్నారని విజిలెన్స్ అధికారుల బెదిరింపులకు దిగారన్నఆరోపణలున్నాయి. దీంతో భయపడిన స్టోన్ క్రషర్ యజమానులు రజనీని కలసి తమకు జరిమానా పడకుండా సాయంచేయాలని కోరగా, అందుకు ప్రతిగా 2.20 కోట్ల రూపాయలు తీసుకున్నారన్న ఆరోపణలపై ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ లో కూడా విడదల రజనీ ప్రమేయం ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో విడదల రజనీ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లే కనపడుతుంది. పోసాని బెయిల్ పై బయటకు రావడంతో తర్వాత ఇక జైలుకు వెళ్లేది విడదల రజనీ అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు కనపడుతున్నాయి.
Next Story