Mon Dec 23 2024 02:23:31 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : బాబు పిటీషన్ కొట్టేసిన ఏసీబీ కోర్టు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వేసిన పిటీషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వేసిన పిటీషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో తనను అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల కాల్ డేటాను భద్రపర్చాలంటూ చంద్రబాబు తరుపున న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన కోర్టు ఇరువర్గాల వాదనను వినింది.
కాల్ డేటా కేసులో...
అయితే సీఐడీ అధికారుల కాల్ డేటా కేసులో చంద్రబాబు న్యాయవాదులు వేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టి వేసింది. ఆ పిటీషన్ ను పరిగణనలోకి తీసుకోలేమని చెప్పింది. కాల్ డేటా ను భద్రపరిచేందుకు అనుమతిని నిరాకరించింది. దీంతో ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్లు వేసిన పిటీషన్ కొట్టివేయడంతో మరి వారు హైకోర్టును ఆశ్రయించే అవకాశముంది.
Next Story