Mon Dec 23 2024 07:48:22 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టు కీలక ఆదేశం
ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్ కు సంబంధించి ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది
ఫైబర్ నెట్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్ కు సంబంధించి ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో చంద్రబాబు సన్నిహితులకు సంబంధించిన 114 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. ఆస్తుల అటాచ్మెంట్ కు అనుమతి ఇవ్వాలంటూ సీఐడీ ఏసీబీ కోర్టును ఆశ్రయించింది.
ఆస్తుల జప్తునకు అనుమతి....
దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ కేసులో గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని నిందితుల ఆస్తులను జప్తు చేయడానికి ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే హోం శాఖ అనుమతిచ్చిన నేపథ్యంలో సీఐడీ కోర్టును ఆశ్రయించింది. త్వరలోనే వీరి ఆస్తులకు సంబంధించి జప్తు నోటీసులను త్వరలోనే నిందితులకు అందచేయనుంది.
Next Story