Mon Dec 23 2024 10:11:31 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : 4 గంటలకు తీర్పు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటీషన్ పై ఏసీబీ న్యాయస్థానం సాయంత్రం నాలుగు గంటలకు తీర్పు వెలువరించనుంది
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటీషన్ పై ఏసీబీ న్యాయస్థానం సాయంత్రం నాలుగు గంటలకు తీర్పు వెలువరించనుంది. ఈరోజు ఉదయం 11.30గంటలకు తీర్పు వెలువడుతుందని భావించినా తీర్పును సాయంత్రం నాలుగు గంటలకు చెపుదామని న్యాయమూర్తి వాయిదా వేశారు. దీనిపై ఏసీబీ కోర్టు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కోర్టు ప్రాంగణం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
కస్టడీ పిటీషన్ పై...
స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబును తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీీఐడీ తరుపున న్యాయవాదులు పిటీషన్ వేశారు. దీనిపై నిన్న ఇటు సీఐడీ తరుపున, అటు చంద్రబాబు తరుపున న్యాయవాదులు మూడు గంటల పాటు వాదనలు జరిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు నేటికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. రేపటితో చంద్రబాబు రిమాండ్ పూర్తవుతున్న నేపథ్యంలో కస్టడీ పిటీషన్ పై ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
Next Story