Mon Dec 23 2024 07:37:42 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది. నవంబరు 1వ తేదీ వరకూ చంద్రబాబు రిమాండ్ ను పొడిగిస్తూ ఏసీబీ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఈరోజుతో చంద్రబాబు రిమాండ్ ముగియడంతో ఆయనను వర్చువల్ గా న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు.
నవంబరు 1వరకూ...
స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో నలభై రోజులుగా రాజమండ్రి జైలులో ఉన్నారన్నారు. ఆయన రిమాండ్ ముగియడంతో అధికారులు వర్చువల్ గా ప్రవేశపెట్టిన తర్వాత న్యాయమూర్తి చంద్రబాబు ఆరోగ్యం గురించి ప్రశ్నించినట్లు తెలిసింది. సెక్యూరిటీ విషయంలో తనకు అనుమానాలున్నాయని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. ఏదైనా ఉంటే తనకు రాతపూర్వకంగా ఇవ్వాలని న్యాయమూర్తి కోరారు. చంద్రబాబు లేఖను తనకు పంపాలని అధికారులను ఆదేశించారు.
Next Story