Sat Dec 21 2024 13:09:06 GMT+0000 (Coordinated Universal Time)
జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. అగ్రిగోల్డ్ విషయంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది.
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. అగ్రిగోల్డ్ విషయంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది. విజయవాడలోని ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో ఈ సోదాలు ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి. ఏసీబీ అధికారులు బృందాలుగా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.
అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో...
ీఅగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో జోగి రమేష్ తో పాటు ఆయన అనుచరులు కూడా ఆస్తులు కొట్టేశారన్న ఆరోపణలతో ఈ సోదాలు జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన కీలక పత్రాల కోసం ఏసీబీ అధికారులు వెతుకుతున్నట్లు తెలిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story