Mon Dec 23 2024 18:22:07 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..
మూడురోజుల క్రితమే రెండవ ఘాట్ రోడ్డులో ఓ వాహనం ప్రమాదానికి గురవ్వగా.. అదృష్టవశాత్తు ఆ వాహనంలో భక్తులెవరూ..
ఇటీవల కాలంలో తిరుమల ఘాట్ రోడ్డులో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. 15 రోజుల వ్యవధిలో మూడుసార్లు ప్రమాదాలు జరిగాయి. మూడురోజుల క్రితమే రెండవ ఘాట్ రోడ్డులో ఓ వాహనం ప్రమాదానికి గురవ్వగా.. అదృష్టవశాత్తు ఆ వాహనంలో భక్తులెవరూ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా ఆదివారం (జూన్11) సాయంత్రం మొదటి ఘాట్ రోడ్డులోని నాలుగవ మలుపులో భక్తులతో వస్తోన్న టెంపో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది.
తమిళనాడుకు చెందిన భక్తబృందం శ్రీవారిని దర్శించుకుని తిరిగి కొండదిగువకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన టెంపో వాహనాన్ని పక్కకు తరలించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.
Next Story