Tue Dec 24 2024 00:08:33 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో కొందరు స్వల్పగాయాలతో బయటపడ్డారు
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో కొందరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. భాష్యకారుల సన్నిధి సమీపంలో ఈ ఘట జరిగిందని చెబుతున్నారు. రెండో ఘాట్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు జీపును, ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పిట్ట గోడను ఢీకొట్టింది.
గోడను ఢీకొట్టడంతో....
అదుపు తప్పి గోడను ఢీకొట్టడంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ చాకచక్యంతోనే ఈ ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ పెద్దగా గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Next Story