Mon Dec 23 2024 07:36:46 GMT+0000 (Coordinated Universal Time)
వల్లభనేని వంశీకి తప్పిన ప్రమాదం
గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ కాన్వాయ్కి ప్రమాదం జరిగింది
గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ కాన్వాయ్కి ప్రమాదం జరిగింది. విజయవాడ- హైదరాబాద్ 65వ జాతీయ రహదారిలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కాశీంపేట వద్ద ఈ సంఘటన జరిగింది. వల్లభనేని వంశీ శనివారం ఉదయం కాన్వాయ్‌లో విజయవాడ నుండి హైదరాబాద్‌కు బయలుదేరారు. తెలంగాణ రాష్ట్రంలోని కాశీంపేట వద్ద ఈ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్‌లోని చివరి రెండు వాహనాలు ఒకదానికొకటి పరస్పరం ఢీకొన్నాయి. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. కానీ రెండు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి.
ఈ ప్రమాదం నుంచి వల్లభనేని వంశీ సురక్షితంగానే బయటపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాదు వెళ్తున్న క్రమంలో.. సూర్యాపేట చివ్వెంల మండలం ఖాసీంపేట వద్ద కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానితో ఒకటి ఢీ కొట్టాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం సైతం ప్రమాదానికి గురైంది.
Next Story