Mon Dec 23 2024 14:23:09 GMT+0000 (Coordinated Universal Time)
కదులుతున్న రైలు కింది పడినా ... ప్రాణాలు దక్కాయి
కాకినాడ రైల్వే స్టేషన్ లో తృటిలో ప్రమాదం తప్పింది. ఒక ప్రయాణికుడు రైలు కింద పడిపోతుండటంతో రైల్వే ఎస్సై అతని ప్రాణాలు కాపాడారు
కాకినాడ రైల్వే స్టేషన్ లో తృటిలో ప్రమాదం తప్పింది. ఒక ప్రయాణికుడు రైలు కింద పడిపోతుండటంతో రైల్వే ఎస్సై అతని ప్రాణాలు కాపాడారు. కాకినాడ రైల్వై స్టేషన్ లో ఒక ప్రయాణికుడు జారి రైలు కింద పడ్డారు. అది గమనించిన రైల్వే ఎస్సై రామారావు వెంటనే రైలు చైన్ లాగమని ఆదేశాలు జారీ చేశారు.
చైన్ లాగడంతో...
దీంతో చైన్ లాగడంతో రైలు ఆగడంతో ప్రయాణికుడి ప్రాణాలు దక్కాయి. కాకినాడ రైల్వేస్టేషన్ లోని రెండో ఫ్లాట్ ఫారం వద్ద ఒక ప్రయాణికుడు జారి రైలు కింద పడిపోయాడు. రైలు కదిలింది. వెంటనే రైల్వే ఎస్సై రామారావు చైన్ లాగించి రైలును ఆపారు. దీంతో ఆ ప్రయాణికుడి ప్రాణాలు దక్కాయి. రైల్వే ఎస్సై చొరవను పలువురు అభినందించారు.
Next Story