Mon Dec 23 2024 12:39:59 GMT+0000 (Coordinated Universal Time)
వీడియో తీసిన భక్తుడి అరెస్ట్?
తిరుమల ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా వీడియో తీసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం
తిరుమల శ్రీవారి ఆలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఆనంద నిలయాన్ని వీడియో తీసిన కేసులో నిందితుడిని తిరుమల పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. నిందితుడు తెలంగాణకు చెందిన వ్యక్తిగా తెలిసింది. నిందితుడిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించామని టీటీడీ విజిలెన్స్ శాఖ అధికారులు తెలిపారు.
ఆధార్ కార్డు ద్వారా...
వీడియో తీసిన భక్తుడు తీసుకు వచ్చిన దర్శన టికెట్ ద్వారా ఆధార్ కార్డును సేకరించి అందులోని చిరునామా ద్వారా గుర్తించినట్లు సమాచారం. నిందితుడిని ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారని తెలిసింది. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది.
Next Story