Mon Dec 23 2024 06:32:24 GMT+0000 (Coordinated Universal Time)
వారికి అచ్చెన్న వార్నింగ్
అధికారులపై టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరాలను అడ్డుకోవాల్సిన వారే నేరాలు చేస్తున్నారన్నారు
అధికారులపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరాలను అడ్డుకోవాల్సిన అధికారులే నేరాలు చేస్తున్నారన్నారు. తమ పార్టీ వారిపై అక్రమ కేసులు బనాయించడం, తర్వాత ఎదుటి పార్టీ వారికి గాయాలు లేకున్నా తీవ్ర గాయాలు అంటూ ఇవ్వడం వైద్యులు నివేదిక ఇవ్వడం పరిపాటిగా మారిందన్నారు. కొందరు వైద్యాధికారులు ఈ రకమైన నేరాలకు పాల్పడుతున్నారన్నారు. మూడేళ్లుగా టీడీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను ఇష్టానుసారంగా ప్రయోగించారన్నారు. వైసీపీ నేతలు, పోలీసులు, వైద్యులు ఒక మాఫియాగా ఏర్పడ్డారని అచ్చెన్న మండి పడ్డారు.
చిత్రహింసలకు గురి చేసి....
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చిత్రహింసలకు గురి చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రతిపక్షాన్ని పూర్తిగా బలహీన పర్చాలన్న ఉద్దేశ్యంతోనే అధికారులు ఈ చర్యలకు పాల్పడుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తాడేపల్లి నుంచి వస్తున్న ఆదేశాలతో నివేదికలను తయారు చేస్తున్నారన్నారు. పోలీసులు, వైద్యులు చట్టానికి, రాజ్యాంగానికి లోబడి పనిచేయకుండా పైవాడిని తృప్తి పర్చడానికే పనిచేస్తున్నారని అచ్చెన్న ఫైర్ అయ్యారు. ప్రతి ఒక్కరి సంగతి త్వరలోనే తేలుస్తామని అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇచ్చారు.
Next Story