Mon Dec 23 2024 13:30:28 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీకి అచ్చెన్న సవాల్
ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మేకపాటి కుటుంబానికి టిక్కెట్ ఇవ్వకుండా ఉండి ఉంటే టీడీపీ పోటీ చేసేది అని అచ్చెన్నాయుడు తెలిపారు.
ప్రజాప్రతినిధులు చనిపోయిన స్థానాల్లో వైసీపీ తన విధానం స్పష్టం చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. దిక్కుమాలిన సవాళ్లు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మేకపాటి కుటుంబానికి టిక్కెట్ ఇవ్వకుండా ఉండి ఉంటే టీడీపీ పోటీ చేసేది అని అచ్చెన్నాయుడు తెలిపారు. గతంలోనూ టీడీపీ అదే విధానాన్ని పాటించిందన్నారు.
తిరుపతిలో మాత్రం....
తిరుపతి పార్లమెంటుకు మృతి చెందిన కుటుంబానికి టిక్కెట్ ఇవ్వకపోవడం వల్లనే తాము పోటీ చేశామన్నారు. ఆత్మకూరులోనూ మేకపాటి కుటుంబానికి టిక్కెట్ ఇవ్వకుంటే ఖచ్చితంగా పోటీ చేసి సత్తా చాటేవారమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అప్పుడు తెలిసేది టీడీపీ సత్తా ఏంటో అనో అని ఆయన సవాల్ విసిరారు. ఇలాంటి వాటిపై వైసీపీ తన వైఖరిని వెల్లడించాలని ఆయన కోరారు.
Next Story