Tue Mar 25 2025 08:48:20 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ కార్యకర్తలకు బ్రహ్మాజీ కోరిక
టీడీపీ కార్యకర్తలకు సినీనటుడు బ్రహ్మాజీ తన మనసులో ఉన్న మాటను చెప్పారు.

టీడీపీ కార్యకర్తలకు సినీనటుడు బ్రహ్మాజీ తన మనసులో ఉన్న మాటను చెప్పారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలు చేసిన తప్పులు చేయవద్దని కోరారు. కేవలం ఏపీని అభివృద్ధి చేసే దిశగానే ప్రయత్నించండి అని కోరారు. మళ్లీ పనిలోకి దిగండని, ఏపీ సురక్షితమైన చేతుల్లోనే ఉందని, మీ భవిష్యత్ పై దృష్టి పెట్టాలని కోరారు.
వాళ్లు తప్పు చేశారని...
వైసీపీ వాళ్లు తప్పు చేశారని మీరు కూడా అదే తప్పులు చేయవద్దని కోరారు. వాళ్లకు మీకు తేడా ఉందని అన్నారు. ఎన్నికల అనంతరం జరుగుతున్న ఘర్షణలపై బ్రహ్మాజీ ఈ విధంగా స్పందించారు. టీడీపీ కూటమి భారీ విజయం సాధించడంతో రాష్ట్ర అభివృద్ధిపట్ల మాత్రమే ఫోకస్ ఉండేలా పనిచేయాలని బ్రహ్మాజీ పిలుపు నిచ్చారు.
Next Story