Mon Dec 23 2024 14:32:59 GMT+0000 (Coordinated Universal Time)
బాబును కలిసిన తర్వాత కూడా?
తెలుగుదేశం పార్టీకి సినీనటి దివ్యవాణి రాజీనామా చేశారు. ఆమె టీడీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు
తెలుగుదేశం పార్టీకి సినీనటి దివ్యవాణి రాజీనామా చేశారు. ఆమె టీడీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. మహానాడులో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, అవమానం జరిగిందంటూ దివ్యవాణి నిన్న రాజీనామా చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. అయితే కొద్దిసేపటికే ఆ ట్వీట్ ను డిలీట్ చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నది వాస్తవం కాదని తెలుసుకున్న దివ్యవాణి ఈ ట్వీట్ డిలీట్ చేశారు.
తెల్లారేసరికి.....
దివ్యవాణి అసంతృప్తి విషయాన్ని తెలుసుకున్న నేతలు కొందరు ఆమెను పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. చంద్రబాబుతో మాట్లాడిన దివ్యవాణి అనంతరం ఆయనను పొగుడుతూ ప్రశంసలు గుప్పించారు. పార్టీ కార్యాయలంలో తనకు ఎంతో మర్యాద ఇచ్చారన్నారు. నిన్న రాత్రి చంద్రబాబును కలిసిన అనంతరం సంతోషంగా పార్టీలోనే ఉంటుందనుకున్న దివ్యవాణి తెల్లారేసరికి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈసారి తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వీడియో ను విడుదల చేశారు.
Next Story