Tue Jan 14 2025 12:15:56 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీవారిని దర్శించుకున్న నమిత దంపతులు.. రాజకీయాలపై ?
నమిత కవల పిల్లలకు తల్లైన విషయం తెలిసిందే. ఇటీవల ఆమె పిల్లలు స్వల్ప అస్వస్థతకు గురవ్వగా.. ప్రస్తుతం వారి ఆరోగ్యం..
ప్రముఖ సినీ నటి నమిత.. ఆమె భర్త వీరేంద్ర చౌదరి, ఇతర కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి నేడు తిరుమల విచ్చేసి.. శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశీర్వచనం అందుకుని.. స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం ఆలయం వెలుపల నమిత మీడియా మిత్రులతో మాట్లాడుతూ.. స్వామి వారి మొక్కు తీర్చుకునేందుకు వచ్చినట్లు తెలిపారు.
నమిత కవల పిల్లలకు తల్లైన విషయం తెలిసిందే. ఇటీవల ఆమె పిల్లలు స్వల్ప అస్వస్థతకు గురవ్వగా.. ప్రస్తుతం వారి ఆరోగ్యం బాగుందని తెలిపారు. స్వామివారికి మొక్కు తీర్చుకునేందుకు తిరుమలకు వచ్చామన్నారు. తన కుటుంబం క్షేమంగా ఉండడం పట్ల స్వామివారికి కృతజ్ఞతలు చెప్పేందుకే తిరుమల వచ్చామని తెలిపారు. సినిమాలు, రాజకీయాలపై తన మనసులోమాట బయటపెట్టింది నమిత. ప్రస్తుతం తాను సినిమాల కంటే రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నానని పేర్కొంది. నమిత 2019లో బీజేపీలో చేరి.. తమిళ బీజేపీ కార్యవర్గ సభ్యురాలిగా నియమితులయ్యారు.
Next Story