Sun Feb 16 2025 13:22:33 GMT+0000 (Coordinated Universal Time)
నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల
నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ ఛార్జిగా ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి నియమితులయ్యారు.
![నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఆదాల](https://www.telugupost.com/h-upload/2023/02/02/1464389-adala-prabhakar-reddy.webp)
నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ ఛార్జిగా ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి నియమితులయ్యారు. జగన్ తో సమావేశమయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ను కలసిన అనంతరం ఆయన మీడియాకు ఈ విషయం తెలిపారు.
ఆదాల ఆనందం...
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇష్యూతో పార్టీ అధిష్టానం అలర్ట్ అయింది. వెంటనే రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమించాలని నిర్ణయించింది. పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చినా చివరకు ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరును జగన్ ఖరారు చేశారు. తనను నెల్లూరు రూరల్ ఇన్చార్జిగా నియమించడంపై ఆదాల ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని తెలిపారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇకపై రూరల్ నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు ఆదాల నేతృత్వంలోనే జరుగుతాయని తెలిపారు.
Next Story