Mon Dec 30 2024 18:05:05 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి కొత్తజిల్లాల పేర్లతో చిరునామాలు
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కొత్త జిల్లాల పేర్లతో అడ్రస్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కొత్త జిల్లాల పేర్లతో అడ్రస్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. ఆధార్ కార్డుల్లో కొత్త జిల్లాల పేర్లు చేర్పునకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం నిర్ణయం తీసుకుంది. జిల్లాల విభజన జరిగినా ఇంకా పా జిల్లాల చిరునామాల పేరిటే సర్టిఫికేట్లు జారీ అవుతుండటంతో జిల్లాల విభజన చేసి ప్రయోజనం లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం చిరునామాలను మర్చాలని నిర్ణయించింది.
ఆధార్ కార్డుల్లో మార్పు...
రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త జిల్లాల పేర్లతో అడ్రస్ సర్టిఫికెట్ల జారీకి సంబంధించి ఏర్పాట్లు చేసింది. నేటి నుంచి కొత్త జిల్లాల పేరిట అడ్రస్తో సర్టిఫికేట్లు జారీ చేయనున్నారు. దీంతో పాటు ఆధార కార్డుల్లో కొత్త జిల్లాల పేర్లను కూడా ఈరోజు నుంచి నమోదు చేయించుకునే వీలును కల్పించింది. తద్వారా స్థానికతపై ఎలాంటి ఇబ్బందులు భవిష్యత్ లో ఎదురు కాకుండా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
Next Story