Tue Nov 05 2024 05:44:24 GMT+0000 (Coordinated Universal Time)
ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్
తాను అనని మాటలను తనకు ఆపాదించారని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్
తాను అనని మాటలను తనకు ఆపాదించారని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పుకొచ్చారు. గురువుల కంటే గూగుల్ మేలు అని తాను వ్యాఖ్యానించినట్లుగా ప్రచారం సాగుతోందని, తాను అనని మాటలను అన్నట్లుగా చెబుతున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. గురువుల కంటే గూగుల్ మేలు అని తాను అనలేదని, ఈ తరహా వార్తలను తాను ఖండిస్తున్నానన్నారు. మారుతున్న కాలంతో కొందరు టెక్నాలజీని అందిపుచ్చుకొని గూగుల్‌పై ఆధారపడుతూ గురువులను మరిచిపోతున్నారనే ఉద్ధేశ్యంతో తాను మాట్లాడినట్లు చెప్పారు. తల్లిదండ్రులు, గురువులపై గౌరవం కలిగిన వ్యక్తినని, తాను అలాంటి వ్యాఖ్యలు చేయనన్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురువుల స్థానంలో గూగుల్ వచ్చిందని.. దీంతో విద్యార్థులకు టీచర్ల అవసరం పెద్దగా లేకుండా పోయిందన్నారని పలు మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేశాయి. దీంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
Next Story