Mon Dec 23 2024 01:02:33 GMT+0000 (Coordinated Universal Time)
డిక్లరేషన్ ఇంకా ఇవ్వలేదు
పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పూర్తయినా గెలిచిన అభ్యర్థికి అధికారులు డిక్లరేషన్ ఇవ్వలేదు.
పశ్చిమ రాయలసీమ ఓట్ల లెక్కింపు పూర్తయినా గెలిచిన అభ్యర్థికి అధికారులు డిక్లరేషన్ ఇవ్వలేదు. ఈ లెక్కింపులో అవతవకలు జరిగాయంటూ వైసీపీ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల అధికారి నుంచి ఆదేశాలు వచ్చేంత వరకూ డిక్లరేషన్ ఇవ్వమని అధికారులు చెబుతున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. టీడీపీ అభ్యర్థి భూంరెడ్డి రాంగోపాల్రెడ్డి గెలిచినా ఎందుకు డిక్లరేషన్ ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు ఫిర్యాదు...
అయితే ఎన్నికల అధికారి నుంచి ఆదేశాలు రాగానే డిక్లరేషన్ ఇస్తామని చెబుతున్నారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలుపొందారని అధికారులు ప్రకటించినా ఇంత వరకూ డిక్లరేషన్ మాత్రం ఇవ్వలేదు. దీనిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా కు ఫిర్యాదు చేశారు. వెంటనే కలగచేసుకోవాలని ఆయన కోరారు. వత్తిళ్ల కారణంగానే టీడీపీ అభ్యర్థికి డిక్లరేషన్ ఫాం ఇవ్వలేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Next Story