Mon Dec 23 2024 04:13:59 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : ఓటమి పాలయిన నేతలతో జగన్
ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ముఖ్యనేతలు ఆ పార్టీ అధినేత జగన్ ను కలుస్తున్నారు
ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ముఖ్యనేతలు ఆ పార్టీ అధినేత జగన్ ను కలుస్తున్నారు. ఈరోజు నుంచి తాడేపల్లిలో పార్టీకేంద్ర కార్యాలయం కూడా ఏర్పాటు కావడంతో జగన్ వద్దకు ఈ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయిన నేతలు వచ్చి జగన్ ను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. ఓటమికి గల కారణాలను జగన్ వారి నుంచి అడిగి తెలుసుకుంటున్నారు.
కారణాలను...
ఎన్నికల్లో వైసీపీ ఇంత దారుణంగా ఓటమి పాలు కావడానికి కారణాలతో పాటు భవిష్యత్ ప్రణాళికపై కూడా జగన్ నేతలతో చర్చిస్తున్నట్లు తెలియవచ్చింది. ఓటమి ఎదురయినా నిలబడి పోరాడాలని కార్యకర్తలకు అండగా నిలవాలని నేతలకు జగన్ సూచిస్తున్నట్లు తెలిసింది. ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని, ప్రజాతీర్పును గౌరవిస్తూనే పోరాటం చేయడమే మనముందున్న మార్గమని దిశానిర్దేశం చేస్తున్నారు.
Next Story