Thu Dec 19 2024 10:11:51 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : కొత్త ఓటర్లకు ఏపీలో చివరి అవకాశం
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన తర్వాత ఎన్నికల కమిషన్ కొత్త ఓటర్లకు మరొక అవకాశం కల్పించింది
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయిన తర్వాత ఎన్నికల కమిషన్ కొత్త ఓటర్లకు మరొక అవకాశం కల్పించింది. కొత్త ఓటు నమోదుకు మరో అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ పేర్కొంది. ఇదే చివరి అవకాశంమని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో మే 13వ తేదీన ఎన్నికలను జరగనున్నాయి. అయినా ఇప్పటి వరకూ ఓటు నమోదు చేయించుకోని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది.
వచ్చే నెల పదిహేనులోగా...
ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ పదిహేనవ తేదీ కొత్త ఓటర్ల నమోదుకు చివరి గడువుగా నిర్ణయించింది. 18 ఏళ్ల వయసు నిండిన వారు ఎవరైనా తమ ఓటును నమోదు చేయించుకోవచ్చని పేర్కొంది. ఇప్పటి వరకూ ఓటు నమోదు చేసుకోని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరంది.
Next Story