Mon Dec 23 2024 19:27:41 GMT+0000 (Coordinated Universal Time)
నేడు స్టీల్ ప్లాంట్ వద్ద భారీ ధర్నా
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దని కోరుతూ కార్మికులు చేస్తున్న ఆందోళన నేటికి 300వ రోజుకు చేరుకుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించవద్దని కోరుతూ కార్మికులు చేస్తున్న ఆందోళన నేటికి 300వ రోజుకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కార్మికులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఢిల్లీకి వెళ్లి తమ నిరసననలను తెలియజేశారు. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుకూల స్పందన రాలేదు. నేడు 300వ రోజు కావడంతో భారీ ధర్నాకు కార్మిక సంఘాలు శ్రీకారం చుట్టాయి.
300వ రోజు....
తొలి రోజుల్లో హడావిడి చేసిన రాజకీయ పార్టీలు తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను పట్టించుకోవడం మానేశాయి. కనీసం పార్లమెంటు సమావేశాల్లో కూడా ఈ అంశాన్ని టీడీపీ, వైసీపీలు ప్రస్తావించడం లేదు. కనీసం ఆందోళనలు కూడా నిర్వహించడం లేదు. కాని రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతు లభిస్తుంది.
Next Story