Thu Dec 19 2024 10:59:47 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి ఉద్యమం షురూ
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమం నేటి నుంచి ప్రారంభం కానుంది. దశల వారీగా వారు ఉద్యమాన్ని నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమం నేటి నుంచి ప్రారంభం కానుంది. దశల వారీగా వారు ఉద్యమాన్ని నిర్వహించనున్నారు. ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోను వెంటనే రద్దు చేయాలని, అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బయటపెట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వచ్చే నెల 7వ తేదీ నుంచి ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. రేపు చీఫ్ సెక్రటరీకి ఉద్యోగ సంఘాలు నోటీసు ఇవ్వనున్నాయి.
రౌండ్ టేబుల్ సమావేశాలు...
ఈరోజు పీఆర్సీ ఉత్తర్వులు, హెచ్ఆర్ఏ వల్ల ఉద్యోగులకు జరిగే నష్టాన్ని వివరించేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమయ్యాయి. ఈరోజు ప్రతి జిల్లా కేంద్రంలో ఉద్యోగ సంఘాలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తున్నాయి. పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ఉద్యోగులు, ప్రజలలో అవగాహన కల్పించనున్నారు.
Next Story