Mon Dec 23 2024 14:29:44 GMT+0000 (Coordinated Universal Time)
బాబు వైఖరి నేలటిక్కెట్ వాడికన్నా ఘోరం
చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఒరిగిందేదో చెప్పాలని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రశ్నించారు.
చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఒరిగిందేదో చెప్పాలని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా, వైఎస్సార్ చేయూత, అమ్మఒడి, ఆసరా, ఈబీసీ నేస్తం వంటి పథకాలను తాము చెప్పగలమన్నారు. అలాంటి పథకాలు ఒక్కటైనా చంద్రబాబు తన పాలనలో చేశారా అని కాకాణి నిలదీశారు. చంద్రబాబువి అన్నీ దోపిడీ పథకాలన్నారు. రైతులను అడ్డంపెట్టుకుని దోచుకున్న చరిత్ర చంద్రబాబుది అని అన్నారు.
ఒక్క పథకం చెబుతారా?
ఈ ప్రభుత్వానికి రైతుల అండ మెండుగా ఉందన్నారు. అది చూసి ఓర్వలేకనే క్రాప్ హాలిడే ను విపక్షాలు తెరమీదకు తెచ్చాయని కాకాణి గోవర్థన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇటు తమ ఎల్లో మీడియా ద్వారా క్రాప్ హాలిడే పై దుష్ప్రచారానికి టీడీపీ దిగిందని, ఎక్కడా అలాంటి పరిస్థితులు లేవని మంత్రి అన్నారు. నేల టిక్కెట్ వాళ్ల కన్నా దిగజారి చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆదుకునే దిశగానే పనిచేస్తుందని చెప్పారు.
Next Story