Sun Dec 22 2024 18:44:53 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిలపై అనుచిత కామెంట్స్... పదవులు ఊడిపోయాయే
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులను రద్దు చేస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులను రద్దు చేస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఏఐసీసీ వెబ్ సైట్ నుంచి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ లు గా పద్మశ్రీ, రాకేష్ రెడ్డి, జంగా గౌతం, మస్తాన్ వలీలు ఉన్నారు. వారి పేర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఫలితాలు వెలువడిన తర్వాత...
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డిలు నేరుగా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై విమర్శలు చేశారు. దీంతో వైఎస్ షర్మిల ఈ విషయాన్ని నేరుగా అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఏఐసీసీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా చర్యలు తీసుకునే క్రమంలో అసలు వారి పోస్టులనే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Next Story