Fri Dec 27 2024 13:09:31 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : ఆరోగ్యం బాగాలేకపోతే.. విజయయాత్ర ఎలా చేస్తారు? చంద్రబాబు బెయిల్పై సజ్జల
చంద్రబాబుకు బెయిల్పై ఒక వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
చంద్రబాబుకు బెయిల్ వస్తే ఒక వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పిన తర్వాత ఆయన మాట్లాడారు. ప్రజలకు ఒకవర్గం మీడియా తప్పుడు సమాచారం ఇస్తుందని అన్నారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో అవినీతి జరగలేదని నిరూపించుకోలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయనకు బెయిల్ లభించిందన్న విషయాన్ని మర్చిపోతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు.
సానుభూతి కోసం...
రాజకీయ సానుభూతి కోసం చంద్రబాబు నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారని అన్నారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసు ఎలా జరిగిందో అందరికీ తెలుసునని అన్నారు. షెల్ కంపెనీల పేరుతో ప్రజల సొమ్మును దోచుకున్నారని అన్నారు. 241 కోట్ల రూపాయలను దోచుకు తిన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కిలారి రాజేష్, పెండ్యాల శ్రీనివాస్ లకు నోటీసులు ఇచ్చిన సంగతి మర్చి పోయారని అన్నారు. అనేక ఫైళ్లపై సంతకాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు త్వరలో విజయయాత్ర చేస్తానని అంటున్నారని, ఆరోగ్యం బాగాలేకపోతే ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు.
Next Story