Wed Dec 25 2024 17:17:58 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Praesh : పింఛను దారులకు ప్రియమైన వార్త.. మరొక కీలక అప్ డేట్
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి గుడ్ న్యూస్ చెప్పింది పింఛనుదారులకే
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి గుడ్ న్యూస్ చెప్పింది పింఛనుదారులకే. సూపర్ సిక్స్ హామీలను అమలులో భాగంగా తొలుత పింఛనును ఏపీ సర్కార్ భారీగా పెంచింది. గతంలో మూడు వేల రూపాయలున్న పింఛనును ఏకంగా నాలుగు వేల రూపాయలకు పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో గతంలో ఉన్న బకాయీలతో కలపి మూడు వేలను జత చేసి తొలి నెలలో ఏడు వేల రూపాయల పింఛను ను వృద్థులు, వితంతువులకు అందచేశారు. దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పింఛను కూడా అందచేశారు. ఇంత పెద్దమొత్తంలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఒక్క ఏపీలోనే అత్యధికంగా పింఛను దారులకు అధికమొత్తంలో పింఛను అందచేస్తున్నారు.
ప్రతి నెలా ఒకటోతేదీన...
ఇక పింఛను దారులకు ప్రతి నెలా స్వయంగా చంద్రబాబు వెళ్లి అందిస్తున్నారు. అలాగే ప్రజాప్రతినిధులు కూడా ప్రతి నెల ఒకటోతేదీన పింఛను అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు.. ఇలా ఒక్కరేమిటి అందరూ నెలలో మొదటి రోజు పింఛను పంపిణీలో పాల్గొంటున్నారు. ఒకే రోజులో పింఛనును అందచేయాలని నిర్ణయించారు. అంతే కాదు మూడు నెలలు పింఛను తీసుకోకపోయినా వాటిని రద్దు చేయకుండా ఒకే సారి మూడు నెలల మొత్తాన్ని పింఛను దారులకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. నెలలో మొదటి తారీఖు సెలవు దినమయితే అంతకు ముందు రోజు పింఛను పంపిణీ చేసేలా ప్రభుత్వం నిధులను కేటాయిస్తూ వస్తుంది.
మరొక కీలక నిర్ణయం...
తాజాగా మరొక కీలక నిర్ణయం తీసుకుంది. పింఛనుదారులు ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబంలో ఒకరికి పింఛను మంజూరు చేయాలని నిర్ణయించడం నిజంగా వరమేనని చెప్పాలి. మరుసటి నెల నుంచే ఆ పింఛనును మరణించిన కుటుంబసభ్యులకు అందచేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. మరణించిన పింఛనుదారులు భార్యకు అదే మొత్తం పింఛనును అందచేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పింఛన్లను ఏరివేస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని, వాటిని నమ్మవద్దని ప్రభుత్వం చెబుతుంది. అనర్హులను మాత్రం జాబితా నుంచి తొలగిస్తామని, అర్హులైన వారు ఎంత మంది ఉన్నప్పటికీ అందరికీ తమ ప్రభత్వం పింఛను మంజూరు చేస్తుందని, భయపడాల్సిన పనిలేదని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story