Mon Dec 23 2024 17:17:50 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో నేడు మార్నింగ్ షోలు రద్దు
సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాప సూచకంగా నేడు ఆంధ్రప్రదేశ్ లో మార్నింగ్ షోలన్నీ రద్దు అయ్యాయి
సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాప సూచకంగా నేడు ఆంధ్రప్రదేశ్ లో మార్నింగ్ షోలన్నీ రద్దు అయ్యాయి. ఈ మేరకు థియేటర్ల అసోసియేషన్ ప్రకటించింది. కృష్ణ మరణం పట్ల సంతాప సూచకంగా థియేటర్లను ఒక షో మూసివేస్తున్నట్లు వారు తెలిపారు. దీంతో ఏపీలోని థియేటర్లన్నీ మార్నింగ్ షోలు వేయకూడదని నిర్ణయించాయి.
షూటింగ్ లు...
సమాచారం తెలియని వారు థియేటర్లకు వచ్చి వెనుదిరిగి వెళుతుండటం కన్పిస్తుంది. ఈరోజు నిర్మాత మండలి షూటింగ్ లు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో షూటింగ్ లు కూడా నేడు బంద్ అయ్యాయి. కృష్ణ మృతితో లాలివుడ్ మొత్తం విషాదంలో మునిగిపోయింది.
Next Story