Wed Apr 09 2025 09:19:11 GMT+0000 (Coordinated Universal Time)
బెజవాడ కిటకిట.. మరికాసేపట్లో...?
విజయవాడలో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. రాష్ట్రం నలమూలల నుంచి ఇప్పటికే జనం స్వరాజ్య మైదాన్ కు చేరుకుంటున్నారు

విజయవాడలో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. రాష్ట్రం నలమూలల నుంచి ఇప్పటికే జనం స్వరాజ్య మైదాన్ కు చేరుకుంటున్నారు. వాహనాలు ఊరు బయట పార్క్ చేసి కాలి నడకన స్వరాజ్ మైదాన్ కు చేరకుంటున్నారు. మరికాసేపట్లో దేశంలో అతి ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్న నేపథ్యంలో జనంతో బెజవాడ వీధులన్నీ కిటకిటలాడిపోతున్నాయి.
జిల్లాల నుంచి...
చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి రాత్రే బయలుదేరిన పార్టీ కార్యకర్తలు ఇప్పటికే అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. దాదాపు లక్షన్నర మంది ప్రజలు ఈ కార్యక్రమానిక హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వైసీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాయంత్రం అంబేద్కర్ విగ్రహంతో పాటు, స్మృతివనాన్ని ఆవిష్కరించనున్నారు.
Next Story