Mon Nov 25 2024 16:07:22 GMT+0000 (Coordinated Universal Time)
సీఎస్, డీజీపీలను బదిలీ చేయకుంటే కష్టం : ఎన్నికల కమిషన్ కు ఎన్డీఏ కూటమి
ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరగకుండా ఉండాలంటే చీఫ్ సెక్రటరీ, డీజీపీలను బదిలీ చేయాలని కూటమినేతలు కోరారు
ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరగకుండా ఉండాలంటే చీఫ్ సెక్రటరీ, డీజీపీలను బదిలీ చేయాలని కూటమినేతలు కోరారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కు టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్, బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు, జనసేన నాదెండ్ల మనోహర్ కలసి ఫిర్యాదు చేశారు. అధికార యంత్రాంగాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని తెలిపారు. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తుందని ఆరోపించారు.
ప్రజాస్వామ్య బద్దంగా....
వారు ఆ పదవుల్లో కొనసాగితే ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా జరిగే అవకాశం లేదని వారు కేంద్ర ఎన్నికల కమిషన్ కు వివరించారు. అలాగే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వీడియో రికార్డింగ్ చేపట్టాలని కోరారు. కొందరు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వినతి పత్రాన్ని అందచేశారు. ఇంటలిజెన్స్ ఐజీతో పాటు వివేక్ యాదవ్, రఘురామిరెడ్డిపై కూడా తాము ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు ఎన్నికల కమిషన్ ను కలిసిన అనంతరం మీడియాకు తెలిపారు.
Next Story