Sat Dec 21 2024 14:43:14 GMT+0000 (Coordinated Universal Time)
Allu Arjun : పవన్ కు షాకిచ్చిన బన్నీ.. నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం
నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటిస్తున్నారు. నంద్యాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటిస్తున్నారు. నంద్యాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అల్లు అర్జున్ ను చూసేందుకు పెద్దయెత్తున అభిమానులు తరలి రావడంతో పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. నంద్యాల వైసీప అభ్యర్ధిగా శిల్పా రవిచంద్ర పోటీ చేస్తున్నారు.
సన్నిహితులు కావడంతోనే...
ఆయనకు మద్దతుగా ప్రచారం నిర్వహించడానికి కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ నంద్యాల చేరుకున్నారు. శిల్పా ఇంటిలో బ్రేక్ ఫాస్ట్ చేసిన అనంతరం ఆయన నంద్యాలలో శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా రోడ్ షో నిర్వహించనున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ కూటమిలో ఉండగా, బన్నీ ఇలా వైసీపీ ఎమ్మెల్యేకు మద్దతు ఇవ్వడమేంటన్న చర్చ జరుగుతుంది. అయితే శిల్పా రవిచంద్రతో ఉన్న సానిహిత్యమే బన్నీని నంద్యాలకు రప్పించిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
Next Story