Sun Dec 22 2024 17:32:15 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : టిక్కెట్ రాకున్నా నేను జగన్ వెంటే.. నన్ను నమ్మండి ప్లీజ్
అమలాపురం పార్లమెంటు సభ్యురాలు చింతా అనూరాధ తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు
అమలాపురం పార్లమెంటు సభ్యురాలు చింతా అనూరాధ తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తాను పార్టీ తన కుటుంబ సభ్యులు పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అదంతా ఒట్టి ప్రచారమేనని ఆమె తెలిపారు. జగన్ నీడలోనే తాను రాజకీయంగా కొనసాగుతానని అనూరాధ స్పష్టం చేశారు. అమలాపురం పార్లమెంటు సీటును ఈసారి రాపాక వరప్రసాద్ కు ఇవ్వడంతో ఆమె కుటుంబీకులు బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జోరుగా సోషల్ మీడియాలో జరిగింది.
పార్టీ మారబోనంటూ...
అయితే తాను ఎట్టిపరిస్థితుల్లో పార్టీ మారబోనని చింతా అనూరాధ తెలిపారు. తనను జగన్ మాత్రమే పార్లమెంటు సభ్యురాలిగా చేశారన్నారు. అటువంటి వ్యక్తి నీడలోనే తాను పనిచేస్తానని ఆమె చెప్పారు. మరో పార్టీలోకి చేరే వ్యక్తిని కానని ఆమె స్పష్టం చేశఆరు. బీజేపీ అభ్యర్థిగా పేరు వినిపిస్తున్న వ్యక్తితో తమ కుటుంబానికి ఎటువంటి సంబంధాలు లేవని అనూరాధ స్పష్టం చేశారు. ఆయన ఎన్ని పార్టీలు మారినా తాము మారబోమని కూడా జగన్ వెంటే తన పయనమని ఆమె తెలిపారు.
Next Story