Sat Nov 16 2024 02:40:04 GMT+0000 (Coordinated Universal Time)
రాజధాని ఉద్యమానికి నేటికి 800 రోజులు
అమరావతి రాజధాని ఉద్యమం ప్రారంభమై 800వ రోజులయింది. దీంతో అమరావతి ప్రాంతంలో రైతులు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు
అమరావతి రాజధాని ఉద్యమం ప్రారంభమై 800వ రోజుకు చేరుకుంది. దీంతో అమరావతి ప్రాంతంలో రైతులు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు. తాము రాజధాని కోసం భూములు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని, మూడు రాజధానుల పేరిట ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. గత రెండున్నరేళ్లుగా అమరావతి రాజధానిని ప్రభుత్వం పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నేడు ప్రత్యేక కార్యక్రమాలు....
రాజధానిని రక్షించుకోవడం కోసం తాము ఎన్ని ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని వారంటున్నారు. తాము న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పాదయాత్ర చేపట్టిన విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. తమ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా తాము మాత్రం రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఆందోళన చేస్తున్నామన్నారు. న్యాయస్థానం ద్వారా తమకు న్యాయం జరుగుతుందన్నారు. ఉద్యమం 800వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఈరోజు ఉదయం 9 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకూ అమరావతి ప్రజాదీక్ష పేరుతో దీక్ష చేపడుతున్నట్లు వారు ప్రకటించారు.
Next Story