Mon Dec 23 2024 16:38:47 GMT+0000 (Coordinated Universal Time)
అమరావతి రైతులకు నిరాశ
సుప్రీంకోర్టులో అమరావతి రైతులకు నిరాశ ఎదురియింది. ఆర్ 5 జోన్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది
సుప్రీంకోర్టులో రాజధాని అమరావతి రైతులకు నిరాశ ఎదురియింది. ఆర్ 5 జోన్పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఆర్ 5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వవద్దంటూ రాజధాని రైతులు వేసిన పిటీషన్ను హైకోర్టు తోసిపుచ్చుతూ మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చిన సంగతి తెలిసిందే. పేదలకు భూములు ఇస్తే తప్పేంటని ప్రశ్నించింది. ఈ కేసును రాజధాని కేసులను ివిచారిస్తున్న జస్టిస్ జోసెఫ్ బెంచ్కు బదిలీ చేసింది.
పేదలకు ఇళ్ల స్థలాలు...
అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో రాజధాని రైతులు సవాల్ చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాలోని పేదలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపై రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం లేదు. ఈ కేసును రాజధాని కేసులను విచారించే ధర్మాసనానికి బదిలీ చేసింది. దాదాపు యాభై వేల మంది పేదలకు ఉచితంగా స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Next Story